Header Banner

సరస్వతి పుష్కరాల సందర్భంగా IRCTC ప్రత్యేక ఆఫర్! సికింద్రాబాద్ టు వారణాసి! ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే!

  Tue Apr 22, 2025 16:14        Travel

సరస్వతి పుష్కరాల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అయోధ్య- కాశి (వారణాశి) పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. తొమ్మిది రాత్రులు/ 10 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. మే 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర, ఏపీలో విజయవాడ, తెనాలి, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్‌లల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.


ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..

ఈ ప్యాకేజీలో పూరీ- గయ- వారణాశి- అయోధ్య, ప్రయాగ్‌రాజ్ ఉన్నాయి. పూరీలో జగన్నాథుడి ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయాలను దర్శించుకోవచ్చు. గయలో ప్రఖ్యాత విష్ణుపాద ఆలయంలో పూజలు చేయవచ్చు. వారణాశి- కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాల్లో పూజల్లో పాల్గొనవచ్చు. అక్కడి కారిడార్‌ కూడా ఈ టూర్ ప్యాకేజీలో చేర్చారు.

అయోధ్యలో చారిత్రాత్మక బాలరాముడి ఆలయం, హనుమాన్ గర్హి ఆలయాలను యాత్రీకులు దర్శించుకోవచ్చు. అక్కడి సరయూ నది హారతిలో పాల్గొనవచ్చు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించే అవకాశం ఉందీ టూర్ ప్యాకేజీ ద్వారా. ప్రయాగ్‌రాజ్‌తో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్లీ సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్.

ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 16,800 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 15,700 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 26,600, పిల్లలకు 25,300 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 34,900, పిల్లలకు 33,300 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!

 

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!

 

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

నేడు భారత్ లో అడుగు పెట్టనున్న ఆంధ్రా అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు.. మోడీతో భేటీ - ఏపీలో ఆ జిల్లాకి రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారు..

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AndhraPradesh #Secundrabad #Varanaasi #saraswathipushkaraalu #IRCTC #offers #specialjourney